హైదరాబాద్, వెలుగు: ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఎఫ్ఏబీఏ), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఇన్నోవేషన్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నాయి. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఈ సదస్సుకు సహకారాన్ని అందిస్తోంది. బయోటెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలను తెలియజేసేందుకు, ఇండస్ట్రీ, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేదుకు ఇన్నోవేషన్ సమ్మిట్ దోహదపడుతుంది.
ఈనెల 16వ తేదీ వరకు డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్ మెంట్ వర్క్ షాప్, 17న వేల్ ట్యాంక్ 2.O, 18న లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ క్లస్టర్ మీట్ ఉంటాయి. వీటితో పాటు విజనరీ కీ నోట్స్, ఇంటరాక్టివ్ వర్క్ షాప్, ఎక్స్ క్లూజివ్ నెట్ వర్కింగ్, ఫోకస్డ్ ప్యానల్ డిస్కషన్స్ కూడా నిర్వహిస్తారు.