కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న ప్రచారం

కరీంనగర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి కరుణాకర్ వినూత్న ప్రచారం చేపట్టాడు. చింతకుంట నుంచి కలెక్టరేట్ కు వరకు మోకాళ్లపై నడుస్తూ ప్రచారం నిర్వహించాడు. తన వెంట ఓ మైక్ పెట్టుకొని, ప్లకార్డును ప్రదర్శిస్తూ.. తనను గెలిపించాలని మోకాళ్లపై నడుస్తూ ప్రజలను వేడుకున్నాడు. ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఇండిపెండెంట్ అభ్యర్థి  బెల్లపు కరుణాకర్, కరీంనగర్ నియోజకవర్గం అని ప్లకార్డులో ప్రదర్శించాడు. 

తనను గెలిపిస్తే.. స్థానిక సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి అందరికీ అండగా ఉండి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలిపాడు. తెలంగాణలో యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో తనకు తెలుసు కాబట్టే.. ఎన్నికల బరిలో దిగానని చెప్పాడు. కాబట్టి తనను గెలిపించాలని కరుణాకర్ కోరాడు.