కల్లు సీసా రేట్ పెంచారని గ్రామస్తుల వినూత్న నిరసన

కల్లు సీసా రేట్ పెంచారని గ్రామస్తుల వినూత్న నిరసన

రోజు వారి పనులకు వచ్చే కూలీలు  రోజు రెండు సీసలు కల్లు తాగుతున్నరని.. ఒక్క కల్లు సీసా 15 రూపాయలు అయితే, రెండు సీసలు కలిపి 30 రూపాయలు అవుతుందని గ్రామస్థులు, ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. రంగారెడ్డి  జిల్లా నందిగామ మండలంలోని చేగుర్ గ్రామంలో గతంలో లాక్ డౌన్ సమయంలో 15 రూపాయలు అమ్మారని, అంతకు ముందు 10 రూపాయలు అమ్మే కల్లు ఇప్పుడు 15 రూపాయలు అమ్మడంతో గ్రామస్థులు కల్లు దుకాణం ముందు టెంట్ వేసుకొని వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అయితే తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజా సమస్యలపై ఎన్నో ధర్నాలు చేయడం.. నిరసనలు చెయ్యడం, వంటావార్పు కార్యక్రమలు చెయ్యడం చూశాం.. కానీ ప్రస్తుతం కల్లు ధర తగ్గించాలని వినూత్నంగా నిరసన చెయ్యడం వింత ఘటనగా చూస్తున్నారు జనాలు.