రిమ్స్ హాస్పిటల్​పై .. ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్​పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. సోమవారం  రిమ్స్​ను పరిశీలించిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రైవేట్ లో వైద్యం చేయించుకునే స్థోమత లేక రిమ్స్ కు వస్తే ఇక్కడ సౌకర్యాలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద ప్రజలకు వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డాక్టర్లు, సిబ్బందిని నియమించడంలేదని మండిపడ్డారు.

ALSO READ :సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: చింతా ప్రభాకర్