కేయూలో ఆక్రమణలు, అక్రమాలపై ఎంక్వైరీ షురూ..

కేయూలో ఆక్రమణలు, అక్రమాలపై ఎంక్వైరీ షురూ..
  • వర్సిటీ భూముల కబ్జాలపై విజిలెన్స్‌‌‌‌, వివిధ శాఖల జాయింట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌
  • అకుట్‌‌‌‌ ఫిర్యాదుతో స్పందించిన ఆఫీసర్లు
  • శనివారం ఆక్రమణలను పరిశీలించిన విజిలెన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌, వర్సిటీ అధికారులు
  • భూముల విషయం తేలాక, మిగతా అక్రమాలపైనా దర్యాప్తు

హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ అక్రమాలపై విజిలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎంక్వైరీ ప్రారంభించింది. వర్సిటీ భూముల ఆక్రమణలు మొదలుకొని వివిధ విషయాలపై ఆరోపణలు రాగా అన్నింటినీ ఆరా తీస్తున్నాయి. అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్​(అకుట్) ఫిర్యాదుతో విజిలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీగా కేయూ భూముల కబ్జాపై దృష్టి పెట్టారు.

వర్సిటీ భూములు అన్యాక్రాంతం కావడం, కొందరు కేయూ ఆఫీసర్లే కబ్జాలకు పాల్పడడంతో ఎంక్వైరీ షురూ చేశారు. ఈ మేరకు విజిలెన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌ అనిల్‌‌‌‌, వర్సిటీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్ వాసుదేవరెడ్డి, వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి పలివేల్పుల, గుండ్లసింగారం వైపు ఉన్న భూములను శనివారం మధ్యాహ్నం పరిశీలించారు.

భూఆక్రమణలపై జాయింట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 673.12 ఎకరాల భూమి ఉంది. సరైన రక్షణ లేకపోవడంతో ఆక్రమణలు వెలిశాయి. ఇక్కడ గజం రూ. లక్ష వరకు పలుకుతుండగా రూ.వందల కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైంది. ముఖ్యంగా కుమార్‌‌‌‌పల్లి శివారులోని 229 సర్వే నంబర్‌‌‌‌లో అసిస్టెంట్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ అశోక్‌‌‌‌బాబుతో పాటు మరికొంతమంది ఇండ్లు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలివేల్పుల శివారు 412, 413, 414, లష్కర్‌‌‌‌ సింగారం శివారు 34 సర్వే నంబర్‌‌‌‌లో కూడా ఆక్రమణలు జరిగినట్లు ఆరోపణలున్నాయి.

వర్సిటీ భూముల రక్షణపై స్పెషల్‌‌‌‌ ఫోకస్‌‌‌‌ పెట్టిన ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ వీసీ వాకాటి కరుణ ఆగస్ట్‌‌‌‌ 8న నిర్వహించిన ఈసీ మీటింగ్‌‌‌‌లో సైతం ఇదే విషయంపై చర్చించారు. వర్సిటీ భూముల ఆక్రమణపై గతంలోనే అకుట్‌‌‌‌ నుంచి ఫిర్యాదులు అందడం, ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ వీసీ చొరవతో విజిలెన్స్ ఆఫీసర్లు జాయింట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్పెక్షన్‌‌‌‌ చేపట్టారు. రెవెన్యూ, సర్వే డిపార్ట్‌‌‌‌మెంట్లతో పాటు మున్సిపల్‌‌‌‌ టౌన్‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌ ఆఫీసర్లతో కలిసి వర్సిటీ భూములను పరిశీలించి  ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. భూ ఆక్రమణలపై రిపోర్ట్‌‌‌‌ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేసేందుకు రెడీ అవుతున్నారు.

మిగతా ఆరోపణలపైనా విచారణ

కేయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌ తాటికొండ రమేశ్‌‌‌‌ హయాంలో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ వ్యవహారాలన్నింటిపైనా విజిలెన్స్‌‌‌‌ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే వర్సిటీలో 16 మంది అడ్జాంట్​ఫ్యాకల్టీని నియమించారన్న ఆరోపణలుఉన్నాయి. అంతేగాకుండా మాజీ వీసీ రమేశ్‌‌‌‌తో పాటు అప్పటి రిజిస్ట్రార్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రావు రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా సీనియర్‌‌‌‌ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందారన్న వ్యవహారం వివాదానికి దారి తీసింది. దీంతో పాటు  వ్యక్తిగత కక్షలతో కొందరు ప్రొఫెసర్ల ప్రమోషన్లు కూడా నిలిపి వేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా 2022లో కేయూ పీహెచ్‌‌‌‌డీ నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేయగా.. రూల్స్​ బ్రేక్​చేసి పార్ట్​ టైం లెక్చరర్లకు సీట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థి సంఘాల నేతలు క్యాంపస్‌‌‌‌లోనే నిరసన దీక్ష చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే వర్సిటీలో ఏఆర్‌‌‌‌గా పనిచేసిన కిష్టయ్య ఈ ఏడాది జనవరిలో ఏసీబీకి చిక్కగా, ఆ సమయంలో వర్సిటీ బిల్లుల చెల్లింపుల విషయంలో 5 శాతం కమీషన్లు తప్పనిసరి అనే చర్చ కూడా జరిగింది. ఇలా గత వీసీ ప్రొఫెసర్‌‌‌‌ తాటికొండ రమేశ్‌‌‌‌ హయాంలోనే వివిధ అక్రమాల ఆరోపణలు రావడంతో ఆయనపై విజిలెన్స్​విచారణకు ఈ ఏడాది మేలో ప్రభుత్వం ఆదేశించింది. అంతేగాకుండా దాదాపు మూడు నెలల కిందట కేయూ ఎగ్జామినేషన్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ నుంచి డిగ్రీ విద్యార్థుల ఆన్సర్‌‌‌‌ బుక్‌‌‌‌లెట్స్‌‌‌‌ బయటకు వచ్చాయి. కొందరు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, బుక్‌‌‌‌లెట్స్‌‌‌‌ను మార్చినట్లు తేలింది. ఈ విషయంపై కేయూ పీఎస్‌‌‌‌లో కేసు కూడా నమోదు అయింది. ఈ వ్యవహారాలన్నింటిపైనా విజిలెన్స్‌‌‌‌ ఆఫీసర్లు విచారణ జరిరి సమగ్ర నివేదిక తయారుచేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆక్రమార్కుల్లో గుబులు

విజిలెన్స్‌‌‌‌ ఆఫీసర్లు విచారణను వర్సిటీ భూముల కబ్జాతో మొదలుపెట్టి ఒక్కో అంశంపై ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయనున్నట్లు తెలిసింది. దీంతో వర్సిటీ భూములు ఆక్రమించిన వారితో పాటు అక్రమార్కుల్లో టెన్షన్‌‌‌‌ మొదలైంది. వర్సిటీ ప్రక్షాళన చేపట్టి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని కొన్నాళ్ల నుంచి విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌‌‌‌ చేస్తుండగా, ఇప్పుడు విజిలెన్స్‌‌‌‌ విచారణ ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సమగ్ర విచారణ జరిపి భూకబ్జాదారులు, వర్సిటీలో అక్రమాలకు పాల్పడిన వారందరిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.