అక్రమ మ్యూటేషన్లపై ముందుకు సాగని ఎంక్వైరీ

అక్రమ మ్యూటేషన్లపై  ముందుకు సాగని ఎంక్వైరీ
  • 2021లో వెలుగులోకి జగిత్యాలలోని ప్రభుత్వ భూముల కబ్జా 
  • టీఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో వెయ్యికిపైగా ప్లాట్లు కబ్జాకు గురైనట్లు గుర్తింపు 
  • ఎంక్వైరీకి ఆదేశించిన నాటి కలెక్టర్
  • నేటికీ అక్రమార్కులు తేలని వైనం 
  • విజిలెన్స్ ఎంక్వైరీకి పెరుగుతున్న డిమాండ్​

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో భూ అక్రమాలు చేపట్టిన ఎంక్వైరీ మూడేళ్లు గడిచినా కొలిక్కి రావడం లేదు. టీఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో సర్కార్‌‌‌‌‌‌‌‌ భూములను కొందరికి ప్రభుత్వం గతంలో పంపిణీ చేసింది. కాగా ఈ పంపిణీలో, ఆ తర్వాత కొందరు  సర్కార్‌‌‌‌‌‌‌‌ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మగా.. మరికొందరు ఆఫీసర్లతో కుమ్మక్కై అక్రమంగా మ్యూటేషన్లు చేయించుకున్నారు.

 ఈ విషయం 2021లో బయటకురాగా.. నాటి సర్కార్‌‌‌‌‌‌‌‌ దీనిపై విచారణ చేయాలని ఆఫీసర్లను నియమించింది. టీఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణాలకు పర్మిషన్లు, కట్టిన ఇండ్లకు మ్యూటేషన్లు చేయకూడదని నాటి కలెక్టర్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో.. బల్దియాకు ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ అక్రమ మ్యూటేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. కాగా నేటికీ అక్రమార్కులను తేల్చకపోవడం గమనార్హం. 

సర్కార్‌‌‌‌‌‌‌‌ భూములకు మ్యూటేషన్లు ఎట్లా చేసిన్రు..

జగిత్యాల సమీపంలో 80 ఎకరాలు సేకరించి టీఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ హౌజింగ్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం 1986, 2006-, 2007 లలో రెండు విడతలుగా, కోటి వరాల కింద పేదలకు 1871 ఫ్లాట్లకు పట్టాలు ఇచ్చింది. కాగా కొందరు దీనిలో అక్రమంగా పట్టాలు పొందగా.. మరికొందరు పేదలకు ఇచ్చిన ప్లాట్లను కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టీఆర్ నగర్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి నిర్మాణాలకు పర్మిషన్లు, కట్టిన ఇండ్ల కు మ్యూటేషన్లు చేయకూడదని 2021లో బల్దియాకు అప్పటి కలెక్టర్ రవి, ఆర్డీవో మాధురి ఆదేశాలు జారీ చేశారు.

 దీంతోపాటు ఈ ఎంక్వైరీ కోసం 16 మంది రెవెన్యూ, మున్సిపల్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటు చేసి డోర్ టూ డోర్ సర్వే చేశారు. టీఆర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో 340 బెస్మెంట్, 691 నివాస ఇండ్లు, 150 ఖాళీగా ఉన్న ఇండ్లు, 178 గుడిసెలు,  33 నాన్ డొమెస్టిక్ నిర్మాణాలు, 65 ఓపెన్ ప్లాట్లు, 108 అద్దెకు ఇచ్చిన ఇండ్లు, 7 శిథిలావస్థ ఇండ్లు, 447 రేకుల షెడ్లతో కలిపి 2019 నిర్మాణాలను గుర్తించారు.

 వీటిలో 1,146 ఫ్లాట్లకు పట్టాలు ఉన్నట్లు గుర్తించగా, పట్టాలు ఉన్న వాటిలో 218 పట్టాలు రెవెన్యూ రికార్డులతో సరిపోలాయి. మరో 464 పట్టాలు రికార్డుల్లో లేనట్లు గుర్తించారు. ఇలా దాదాపు వెయ్యికి పైగా ఇండ్ల పట్టాలు ఫేక్‌‌‌‌గా ఉన్నట్లు గుర్తించారు. వీటికి రూల్స్​కు విరుద్ధంగా బల్దియాలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌‌‌‌ లేకుండా, ప్రభుత్వ భూమికి మ్యూటేషన్ చేయడంపై విమర్శలు ఉన్నాయి. 

నేటికీ అక్రమార్కులను తేల్చలే

ఎంక్వైరీ చేపట్టి ఫేక్​పట్టాల బాగోతాలను తేల్చాల్సిన ఆఫీసర్లు.. పట్టించుకోకపోవడంతో కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లీగల్‌‌‌‌గా ఉన్న కొందరి ఫ్లాట్లను రెగ్యులరైజ్‌‌‌‌ చేస్తూ జీవో 58 ప్రకారం 2022లో 58 మందికి, 2023 లో 40 మందికి పట్టాలు కూడా అందజేశారు. ఇప్పటికే సర్కార్ భూమి కబ్జాకు గురి కాగా, బల్దియా ఆఫీసర్లు సైతం అక్రమ మ్యూటేషన్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తంతుపై పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత సర్కార్ ఒత్తిడి మేరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి.