కరీంనగర్ జైలులో ఉన్న బండి సంజయ్ బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. కరీంనగర్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. లంచ్ మోషన్ పిటిషన్ పై కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నారంటూ సంజయ్ పై తప్పుడు కేసు పెట్టారని అడ్వకేట్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.
బెయిల్ కోసం ఎంపీ బండి సంజయ్ లాయర్లు వేసిన లంచ్ మోషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే రోస్టర్ విధానంలో ప్రజాప్రతినిధుల కేసులు తాను విచారించలేనని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తెలిపింది. ఈ పిటిషన్ ను సంబంధిత బెంచ్ కి బదిలి చేయాలని రిజిస్టార్ ను ఆదేశించింది. ఇదే అంశాన్ని సంబంధిత బెంచ్ కు తెలపాలని కూడా పిటిషనర్ ను ఆదేశించింది.
For More News..
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
కానిస్టేబుల్ విధులు కూడా సీపీనే చేశారు