CSK vs RR: ఇది మామూలు స్టన్నర్ కాదు.. పరాగ్ గేమ్ ఛేంజింగ్ క్యాచ్

CSK vs RR: ఇది మామూలు స్టన్నర్ కాదు.. పరాగ్ గేమ్ ఛేంజింగ్ క్యాచ్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కుడి వైపు ఫుల్ డ్రైవ్ చేస్తూ అందుకున్న ఈ క్యాచ్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. హసరంగా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్ మూడో బంతిని దూబే గట్టిగా ఆఫ్ సైడ్ ఆడాడు. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న పరాగ్.. అసాధ్యమనుకున్న క్యాచ్ ను డైవ్ చేస్తూ తన చేతి వేళ్ళతో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పరాగ్ బంతిని క్యాచ్ పట్టిన తర్వాత బంతిని కంట్రోల్ చేసుకున్న విధానం అద్బుతమనే చెప్పాలి. 

ALSO READ | CSK vs RR: నితీష్ రాణా విధ్వంసకర ఇన్నింగ్స్.. చెన్నై ముందు బిగ్ టార్గెట్

ఈ ఓవర్ లో తొలి బంతిని దూబే ఫోర్.. రెండో బంతిని సిక్సర్ బాది 10 పరుగులు రాబట్టాడు. మూడో బంతిని కూడా భారీ షాట్ కు ప్రయత్నించగా.. కవర్స్ లో పరాగ్ చేతికి చిక్కాడు. దీంతో చెన్నై కీలకమైన దూబే వికెట్ కోల్పోయింది. గైక్వాడ్ (41) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నై 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. దూబే (18), త్రిపాఠి (23), రచీన్ రవీంద్ర (0), విజయ్ శంకర్ (9) విఫలమయ్యారు. చెన్నై గెలవాలంటే మరో 8 ఓవర్లలో 90 పరుగులు చేయాలి.