
ఇద్దరు నిందితులు అరెస్ట్
మియాపూర్, వెలుగు: మియాపూర్‌లో బస్టాప్ వద్ద నిల్చున్న మతిస్థిమితం లేని మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఏసీపీ శ్రీనివాస్‌రావు తెలియజేశారు. కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళ(35)కు మతిస్థిమితం లేకపోవడంతో మియాపూర్ క్రాస్‌రోడ్డు బస్టాప్‌వద్ద ఉంటోంది.
21న అర్ధరాత్రి అక్కడే ఉన్న ఆమెను ఇద్దరు స్కూటీపై వచ్చి బలవంతంగా బాచుపల్లి వైపు తీసుకువెళ్లారు. దీన్ని చూసిన ఓ క్యాబ్ డ్రైవర్ 100కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు మూడు గంటల్లోనే మహిళను ఐడీఏ బొల్లారం వద్ద గుర్తించారు. వైద్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు.
డాక్టర్లు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించడంతో కిడ్నాప్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 23న బాలకుమార్(25), మహేశ్(24)ను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను మియాపూర్బస్టాప్ నుంచి అలియాపురం తండా సమీపంలోకి తీసుకువెళ్లి లైంగికదాడి చేసి వదిలేసినట్లు విచారణలో అంగీకరించారు.
దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చందానగర్‌లోని శాంతినగర్‌కు చెందిన బాలకుమార్ ఆటో నడుపుతూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇతనిపై ఇప్పటికే స్నాచింగ్, రాబరీ, ఇండ్లలో దొంగతనాల వంటి 8 కేసులున్నాయి. మెదక్ జిల్లా గుడిపెద్దాపూర్ కు చెందిన మహేశ్ పెయింటర్. ఇతనిపై మర్డర్ కేసు, దొంగతనం కేసు ఉందని ఏసీపీ తెలిపారు.