- ISRO చరిత్రలో మరో మైలురాయి..
- విజయవంతంగా కక్ష్యలోకి INSAT-3DS ఉపగ్రహం
ISRO చరిత్రలో మరో మైలురాయిని దాటింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) శనివారం (ఫిబ్రవరి 17, 224) తన అధునాతన వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ -3DS ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.వాతావరణ అధ్యయనం, విపత్తు హెచ్చరికల కోసం INSAT-3DS ఉపగ్రహం ఫిబ్రవరి 17 సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. INSAT-3DSఉపగ్రహం మోసుకెళ్తున్న అంతరిక్ష నౌక GSLV-F14 నిప్పులు జిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా INSAT-3DS ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మూడో తరం వాతావరణ ఉపగ్రహానికి ఇది వారసునిగా పనిచేయనుంది.
లిఫ్టాఫ్ అయిన 18 నిమిషాల తర్వాత మూడు దశల రాకెట్.. INSAT-3DS వాతావరణ ఉపగ్రహాన్ని 253 కి.మీ. జియో సింక్రోనస్ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇన్సాట్ 3DS ఉపగ్రహం భూస్థిర కక్ష్యనుంచి మూడవ తరం వాతావరణ ఉపగ్రహం కొనసాగింపుగా ప్రవేశపెట్టింది ఇస్రో. ప్రస్తుతం ఈ ఉపగ్రహం ఇన్సాట్-3డి, ఇన్సాట్ 3డిఆర్ ఇన్ ఆర్బిట్ శాటిలైట్ లతో పాటు వాతావరణ సేవలను పెంపొందిస్తుంది.
ఈ ఉపగ్రహం మెరుగైన వాతావరణ పరిశోధనలు, వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికలకోసం భూమి, సముద్ర ఉపరితాలలను పర్యవేక్షించడం కోసం రూపొందించిన ప్రత్యేకమైన మిషన్ అని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.
పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. INSAT-3DS ఉపగ్రహం బరువు 2,239 కిలోలు . ఇందులో 6చానెల్ ఇమేజర్, 19 చానెల్ సౌండర్, డాటా రిలే ట్రాన్స్ పాండర్, సెర్చ అండ్ రెస్క్యూ ట్రాన్స్ పాండర్ పేలోడ్లు ఉన్నాయి.