ఇన్సాట్​ వ్యవస్థ

ఇన్సాట్​ వ్యవస్థ

ఇన్సాట్​ ఉపగ్రహాలను జీఎస్​ఎల్వీ వాహక నౌక ద్వారా జియో స్టేషనరీ ఆర్బిట్​లో ప్రవేశపెడతారు. భారతదేశంలో ఇన్సాట్​ వ్యవస్థ 1982, ఏప్రిల్​ 10న ఇన్సాట్​–1ఏ ప్రయోగం ద్వారా ప్రారంభమైంది. ఫ్రెంచ్​ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియేన నౌకల ద్వారా కొన్ని ఇన్సాట్​ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.  

అనువర్తనాలు

  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 620 ప్రధాన టెలికమ్యూనికేషన్స్​ టెర్మినల్స్​ ద్వారా మొబైల్​, ల్యాండ్​లైన్​ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ సేవలకు ఇన్సాట్​ ఉపగ్రహాలు ప్రధాన కారణం.
  • టెలి మెడిసిన్​ సేవల కోసం ఇన్సాట్​ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు.
  • భూ ఉపరితల సమాచార వ్యవస్థను ఇన్సాట్​ ఉపగ్రహం సహాయంతో ఇస్రో అభివృద్ధి చేసింది.
  • కల్పనా–1 అనే ఇన్సాట్​ ఉపగ్రహం అందించే వాతావరణ సమాచారాన్ని ఇండియన్​ మెటియోరాలజీ డేటా ప్రాసెసింగ్​ సిస్టమ్​ (ఐఎండీపీఎస్​) విశ్లేషిస్తుంది. దీనివల్ల తుపానులు, వరదలు, ఉపరితల ఉష్ణోగ్రత మొదలైన అంశాల సమాచారం అందుతుంది.
  • ఆన్​లైన్​ మనీ ట్రాన్స్​ఫర్​, ఆన్​లైన్​ రిజర్వేషన్​, ఏటీఎం వంటి సేవలు ఇన్సాట్​ ఉపగ్రహాలు అందిస్తున్నాయి.
  • ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్య కార్యక్రమాలు ఇన్సాట్​ ఉపగ్రహాల ద్వారా సఫలీకృతం అవుతున్నాయి. 
  • దేశవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత విద్యాసేవలను అందించడంలో ఇన్సాట్​ ఉపగ్రహమైన ఎడ్యూశాట్​ ఉపయోగపడుతుంది. 
  • భారత అంతరిక్ష కార్యక్రమంలోని మొదటి థీమాటిక్​ ఉపగ్రహం ఎడ్యూశాట్​.