మొక్కజొన్నకు టోరీ సూపర్

మొక్కజొన్నకు టోరీ సూపర్

హైదరాబాద్, వెలుగు: మొక్కజొన్న పంట భద్రతకు భరోసా ఇచ్చే టోరీ సూపర్ ను ఆగ్రో కెమికల్ కంపెనీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెక్టిసైడ్స్ (ఇండియా) లిమిటెడ్ (ఐఐఎల్) ప్రారంభించింది.  దీనిపై కంపెనీ ఎండీ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ ఇది ఎస్పీఎఫ్​ టెక్నాలజీతో పనిచేస్తుందని చెప్పారు. ఈ టెక్నాలజీ వల్ల పంటలు తెగుళ్లను తట్టుకుని ఆరోగ్యంగా పెరుగుతాయని, కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు.

సాగు ఉత్పాదకతను పెంచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం తమ విధానమని చెప్పారు.  టోరీ సూపర్​ను ఐఐఎల్ ఆర్ అండ్​ డీ సెంటర్​అభివృద్ధి చేసింది. దీనిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయడానికి ప్రదర్శనలు నిర్వహించామని ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెక్టిసైడ్స్ తెలిపింది.