భోజనంలో మళ్లీ పురుగులు

కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ అధికారుల తీరు మారడం లేదు. వారం రోజుల క్రితమే స్టూడెంట్లు తినే అన్నంలో పురుగులు వచ్చిన సంఘటన మరువక ముందే మరోసారి బాలికల హాస్టల్ లో ఆదివారం వండిన భోజనంలో  పురుగులు వచ్చాయని స్టూడెంట్లు తెలిపారు. కాలేజీ ప్రిన్సిపాల్  రెగ్యులర్​గా తనిఖీలు చెయ్యకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నదని విద్యార్థులు వాపోయారు. కరోనా అనంతరం ఫుడ్  సేఫ్టీ అధికారులు కాలేజీ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో మెస్ నిర్వాహకులకు అలుసుగా మారిందన్నారు.

మొదటిసారి అన్నంలో పురుగులు వచ్చినప్పుడే ప్రిన్సిపాల్ చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని స్టూడెంట్లు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు టీసుకోవాలని వారు కోరుతున్నారు.