
ఇటీవల కాలంలో పలు కంపెనీలు జాబ్ లేఆఫ్స్తో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంది. ఏ క్షణంలో యాజమాన్యం లేఆఫ్ చెబుతుందోనని భయాందోళనతో టెకీలు ఉన్నారు. అయితే ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆందోళనపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఉద్యోగ భద్రత, స్థిరమైన ఉపాధి లేని ఉద్యోగాలతో ఆరోగ్యానిక ముప్పు ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో కూడా తేలింది ఇదే.. ఉద్యోగం భద్రతలేని వ్యక్తి శాశ్వత ఉద్యోగ ఉపాధిని పొందినట్టయితే 20 శాతం అకాల మరణాలను తగ్గించవచ్చంటున్నాయి నివేదికలు.
స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ కు చెందిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఇది జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ రిపోర్ట్స్‌లో ప్రచురించబడింది. ఉద్యోగ భద్రత మార్కెట్ మెరుగు పడాల్సిన అవసరం ఉందని పరిశోధనలో తేలింది. స్థిరమైన ఉపాధి పొందడం వల్ల అకాల మరణాల ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఈ అధ్యయనం చెబుతోంది. సురక్షితమైన ఉపాధి ఒప్పందం లేకుండా ఉద్యోగాలలో పని చేసే వారికి అకాల మరణం సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కూడి తెలిపింది ఈ జర్నల్.
స్వీడన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు మొత్తం 55 ఏళ్లలోపు 2ల క్షల 50 వేల మంది కార్మికుల నుంచి 2005 నుంచి 2017 వరకు సేకరించిన నమోదు చేయబడిన డేటాను పరిశోధించారు. ఈ పరిశోధనలో స్థిరమైన ఉద్యోగం, ఉపాధి ఉన్నవారు.. తక్కువ జీతం, ఉద్యోగ భద్రత లేని వారిలో 20 శాతం ఎక్కువ అకాల మరణాలున్నట్లు గుర్తించారు.