టాలీవుడ్ స్టార్ హీరోలలో అల్లు అర్జున్(Allu Arjun)కు ఓ ప్రత్యేకమైన..స్టార్ స్టేటస్ ఉంది. 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇక తన స్టైలీష్ లుక్, భిన్నమైన డ్యాన్స్, అంతకుమించిన వ్యక్తిత్వం..ఇలా ప్రతి విషయంలో అందరి కంటే భిన్నంగా ఉండే బన్నీ ప్రతిదీ లగ్జరీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు.
అతనికి సినిమాలపై ఇంట్రెస్ట్తో పాటు..లగ్జరీ కార్లు..ఇల్లు టాప్ ప్లేస్లో ఉండేలా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. తన విలాసవంతమైన జీవితంలో..తన ఆటో మొబైల్ గ్యారేజ్లో ఉండే కార్లు..వాటి స్పెషాలిటీస్ ఏంటనేవి చూసేద్దాం.
అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్:
అల్లు అర్జున్‌కి ఆటోమొబైల్స్‌పై ఉన్న ఎనలేని మక్కువ గురించి..ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరికీ తెలిసిందే. అతను కలిగి ఉన్న కొన్ని అద్భుతమైన కార్లలో BMW X5, జాగ్వార్ XJL ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే..అల్లు అర్జున్ వ్యానిటీ వ్యాన్(Vanity Van) మరొక ఎత్తు. నిజం చెప్పాలంటే..ఇది వ్యాన్ చక్రాలపై ఉన్న లగ్జరీ..ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక స్వర్గధామం. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ వ్యాన్ ధర రూ. 7 కోట్లు. ముద్దుగా దీనిని ఫాల్కాన్ (Falcon) అని పిలుచుకుంటాడట అల్లు అర్జున్. బెసిగ్గా బ్లాక్ కలర్ను ఇష్టపడే బన్నీ..ఈ వ్యానిటీ వ్యాన్ కారును పూర్తిగా బ్లాక్‌లో ఉండేలా డిజైన్ చేపించాడు.
అంతేకాదు..వ్యాన్ లోపల చాలా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. లివింగ్ ఏరియా, ప్రీమియం లాంజ్, హాయిగా ఉండే బెడ్‌రూమ్ ప్రత్యేకమైన మేకప్ రూమ్..భారీ టీవీ సెట్, ఫ్రిజ్‌తో పాటు సౌకర్యవంతమైన రిక్లైనర్ ఇందులో అమర్చారు.
వీటికి సంబంధించిన ఫొటోలను అర్జున్ అల్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ కూడా చేశాడు. 'నా జీవితంలో ఏదైనా పెద్ద వస్తువు కొన్న ప్రతిసారీ..నా మనసులో ఒక్కటే ఆలోచన..“ప్రజలు చాలా ప్రేమను కురిపించారు..వారి ప్రేమకు ఉన్న శక్తి వల్లనే నేను ఇవన్నీ కొనగలుగుతున్నాను..ఎప్పటికీ కృతజ్ఞత..అందరికీ ధన్యవాదాలు. ఇది నా వానిటీ వాన్ "ఫాల్కాన్" అని పోస్ట్ చేశారు. ఈ వ్యాన్ ముందు భాగంలో ఫాల్కోన్ అని రాసి ఉండగా..ఇరువైపు ఏఏ(AA) ఉంటుంది.
ఇక తన దగ్గర ఉన్న కార్లను చూసుకుంటే..రెడ్ మెర్సిడేజ్ 200 సీడీఐసి..ఈ ఎలక్ట్రిక్ కారు కాస్ట్ రూ. 31 లక్షలు. కాగా బన్నీ ఈ కారులోనే ఫ్యామిలీతో కలిసి షికార్లకు..బయట ఈవెంట్స్ కి వెళుతుంటాడట.
అలాగే మరో విలువైన కారు..రేంజ్ రోవర్ వోగ్. అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడి ఈ కారు కొన్నాడట. ఈ కారుకి బీస్ట్ అని పేరు పెట్టాడు బన్నీ. ఈ రేంజ్ రోవర్ కారు ఖరీదు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో నటిస్తున్నాడు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్స్ అట్లీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టేసాడు.
Every time I buy something big in my life... there is only one thought in my mind ... “ People have showered soo much love...it’s the power of their love that I am being able to buy all this “ Gratitude forever . Thank you all ❤️. It’s my Vanity Van “FALCON” pic.twitter.com/pSRBjIFfy0
— Allu Arjun (@alluarjun) July 5, 2019