వంద పడకల ఆసుపత్రికి భవనాల పరిశీలన

వంద పడకల ఆసుపత్రికి భవనాల పరిశీలన

వైరా, వెలుగు : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వైరా నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కోసం వైరా ఎమ్మెల్యే మాలోత్​ రాందాసు నాయక్​ సోమవారం పలు భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో నూతన ఆసుపత్రి నిర్మాణానికి అన్ని  సిద్ధం చేశామని, స్థల పరిశీలన పూర్తయ్యే వరకు వైరాలోని కేవీసీఎం డిగ్రీ కళాశాల బిల్డింగ్​లో వైద్య సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. 

ఈ క్రమంలోనే కేవీసీఎం కాలేజీ బిల్డింగ్​ను పరిశీలించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్​ శ్రీనివాసరావు, మున్సిపల్​కమిషనర్​ వేణు, నాయకులు పువాళ్ల దుర్గ ప్రసాద్, దాసరి దానియేలు శ్రీధర్ ఉన్నారు.