సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో సోమవారం ఉదయం భారీ వర్షాలు పడటంతో చేతికొచ్చిన వరి పంటలు దెబ్బతినడంతోరైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి ఆధ్వర్యంలో ఏఈవోలు సదాశివనగర్, ధర్మారావుపేట్, అమర్లబండ, మర్కల్, తిర్మన్‌పల్లి, పద్మాజివాడి, మోడెగామ, మల్లుపేట్ తదితర గ్రామాలలో పంటలను పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
సదాశివనగర్ లో 22 ఎకరాలు, ధర్మారావుపేట్ లో30 ఎకరాలు, అమర్లబండ లో 10 ఎకరాల వరి పంట నష్టం జరిగినట్లు ఏఓ తెలిపారు. పంట నష్టం వివరాలను జిల్లా అధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు కవిత, శ్రీనివాస్ నాయక్, శ్రీలక్ష్మి, కల్యాణి, ప్రణీత, గాయత్రి, రైతులు పాల్గొన్నారు.