కూసుమంచిలో ఎరువుల దుకాణాల తనిఖీ

కూసుమంచిలో ఎరువుల దుకాణాల తనిఖీ

కూసుమంచి, వెలుగు :  కూసుమంచి, చేగొమ్మ గ్రామాల్లో ఎరువుల, విత్తన దుకాణాలను కూసుమంచి  మండల వ్యవసాయ అధికారి ఆర్.వాణి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ డీలరు పీవోవైస్ మిషన్ ద్వారా ఎరువులను అమ్మాలన్నారు.   లైసెన్సు, స్టాక్ బోర్డు, ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు. విత్తన అమ్మకాలను రైతు వారీగా రిజిస్టర్ లో పొందుపరచాలని సూచించారు. ఏ డీలర్ అయినా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.