కామారెడ్డి , వెలుగు : గాంధారి మండలంలోని చద్మల్తండా, నేరల్తండా, బిర్మల్తండాల్లో బుధవారం పొద్దున పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో సదాశివనగర్, ఎల్లారెడ్డి సీఐలు, పలువురు 14 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, ఇతర సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
గంజాయి సాగు చేస్తున్నారనే అనుమానాలపై సోదాలు చేశారు. పంట భూములు, ఇతర పంటల మ ధ్యలన పరిశీలించారు. చద్మల్తండాలో గుర్తు తెలియని వ్యక్తి దాచి ఉంచిన 15 కిలోల ఇప్ప పువ్వు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రతి రోజు తనిఖీలుచేపట్టనున్నట్లు ఎస్పీ సింధూశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.