తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఐటీడీఏ పీవో అంకిత్ గురువారం పరిశీలించారు. ముందుగా వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ స్థలాల్లో పనులను పరిశీలించి కల్వర్టు పనులు, చెట్ల తొలగింపును స్పీడప్ చేయాలని ఆదేసించారు. కాల్వపల్లి వైపు తెగిన రోడ్డుకు రిపేర్లు చేయాలని సూచించారు.
అనంతర కాల్వపల్లి స్కూల్‌ను, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అజయ్‌కుమార్, డిప్యూటీ ఇంజినీర్ రవీందర్, ఎం.రాజ్‌కుమార్ ఉన్నారు.