
లింగంపేట, వెలుగు: లింగంపేట మండల కేంద్రంలోని పలు మెడికల్ షాపులను శుక్రవారం కామారెడ్డి జిల్లా డ్రగ్ఇన్స్ పెక్టర్ రాజారెడ్డి ఆకస్మికంగాతనిఖీ చేశారు. మెడికల్షాపుల్లో నిల్వ ఉంచిన మందులకు సంబంధించిన ఇన్వాయిస్ బిల్లులను, స్టాక్అండ్సేల్రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. డాక్టర్ ప్రిష్కిప్షన్ ఉంటేనే మందులను విక్రయించాలనీ, మందులు కొనుగోలు చేసే వారికి బిల్లులను ఇవ్వాలనీ సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మందులను విక్రయించే వారి లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.