హనుమకొండ జిల్లాలో పీహెచ్​సీల తనిఖీ

హనుమకొండ జిల్లాలో పీహెచ్​సీల తనిఖీ

ఎల్కతుర్తి/ ములుగు, వెలుగు : హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్ పీహెచ్​సీని డీఎంహెచ్ వో అల్లెం అప్పయ్య, ములుగు జిల్లా రాయిని గూడెం పీహెచ్​సీ, జంగాలపల్లి ఆయుష్మాన్​ఆరోగ్య మందిర్​ను డీఎంహెచ్​వో ఎన్.గోపాల్​రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు.

ప్రభుత్వం అందించే సౌకర్యాలను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్యక్రమాల్లో మెడికల్​ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది తదితరులున్నారు.