ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ తనిఖీ

కాటారం, వెలుగు : భూపాలపల్లి జిల్లా కాటారంలోని ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ను శనివారం వరంగల్‌‌ డ్రగ్‌‌ కంట్రోల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అడిషనల్‌‌ డైరెక్టర్‌‌ రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. మెడికల్‌‌ షాపులకు సంబంధించిన లైసెన్స్‌‌, నాసిరకం మందుల వివరాలను ఆరా తీశారు. అరవింద్‌‌ హాస్పిటల్‌‌లో ఎలాంటి పర్మిషన్‌‌ లేకుండా మెడికల్‌‌ షాపు నిర్వహిస్తుండడంతో దానిని సీజ్‌‌ చేశారు.

ఫార్మాసిస్ట్‌‌ సర్టిఫికెట్‌‌ లేకుండానే నిర్వహణ కొనసాగుతుండడంతో నిర్వాహకుడు శ్రీనివాస్‌‌రావుపై క్రిమినల్‌‌ కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏడీ రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌లో నాసి రకం మందులు అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. లైసెన్స్‌‌ లేకుండా మెడికల్‌‌ షాపు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడీ వెంట డ్రగ్‌‌ ఇన్స్‌‌పెక్టర్లు అరవింద్, బాలకృష్ణ, పావని ఉన్నారు.