ములుగు, వెలుగు : ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద జరుగుతున్న హైవే విస్తరణ పనులను ఎస్పీ డాక్టర్ పి.శబరీశ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర టైం దగ్గర పడుతుండడంతో వెహికల్స్ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు.
పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఏదైనా సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాటుపై చర్చించారు. కల్వర్టు పక్కన కాజ్‌వే ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఆయన వెంట ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్, డీఎస్పీ రవీందర్, సీఐ రంజిత్‌కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పొలాల వద్ద కరెంటు తీగలు అమర్చితే కేసులు
వన్యప్రాణులను వేటాడడం కోసం పొలాలు, అడవుల్లో కరెంట్ తీగలు అమర్చే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శబరీశ్ హెచ్చరించారు. ఈ తీగల వల్ల మూగజీవాలు, మనుషులు మృత్యువాతపడుతున్నారన్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసే వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.