
తాడ్వాయి, వెలుగు : మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేపట్టాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం జంపన్న వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తుగా మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. టాయిలెట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని చెప్పారు. అనంతరం మీడియా సెంటర్‌ను పరిశీలించారు. జాతర కవరేజ్‌కు వచ్చే జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సెంటర్‌లో అవసరమైన రిపేర్ వర్క్స్‌ను త్వరగా ప్రారంభించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆమె వెంట ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డీపీవో వెంకయ్య, ఐటీడీఏ ఎస్‌వో రాజ్‌కుమార్ ఉన్నారు.