
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాన్ని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ క్రాంతి వెల్లడించారు. శనివారం కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ , మీడియా సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సెంటర్ , స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచల భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మీడియా సెంటర్ ద్వారా కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లుచంద్రశేఖర్, మాధురి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
మాక్ పోలింగ్ పరిశీలన
సెక్టార్ అధికారులు , సహాయక సెక్టార్ అధికారులకు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన మాక్ పోల్ కార్యక్రమాన్ని కలెక్టర్ క్రాంతి పరిశీలించారు. ఓటింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్‌పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఈవీఎంల పనితీరుపై అవగాహన ఏర్పడుతుందన్నారు. ఓటింగ్ సమయంలో సులువుగా తాము ఎంచుకున్న అభ్యర్థికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.