
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ రైస్ మిల్లును సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు సోమవారం తనిఖీ చేశారు. మిల్లులో రికార్డులను పరిశీలించి, వడ్ల శాంపిల్స్ సేకరించారు. సీఎంఆర్ విషయంలో కొందరు మిల్లు ఓనర్లు కావాలని జాప్యం చేస్తున్నారని సివిల్ సప్లయీస్ ఆఫీసర్లకు సమాచారం అందింది. మిల్లుల్లో వడ్ల స్టాక్ లేకపోవడం వల్లే ఆలస్యం చేస్తున్నారని, సీఎంఆర్ లోటును పూడ్చుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి వడ్లను సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వడ్ల కొనుగోలు సందర్భంగా పలువురు మిల్లర్లు రైతుల నుంచి సేకరించిన వడ్ల గ్రేడ్ ఛేంజ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ‘ఏ’ గ్రేడ్ వడ్లను తీసుకొని ‘బి’ గ్రేడ్ కింద లెక్కిస్తున్నట్లుగా తెలియడంతో కొందరు రైతులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినట్ల సమాచారం. దీంతో స్పందించిన ఆఫీసర్లు సోమవారం భువనగిరి శివారులోని ఓ మిల్లులో తనిఖీలు చేశారు. వడ్ల స్టాక్ విషయంపై రికార్డులను పరిశీలించి, వడ్ల శాంపిల్స్ సేకరించారు.