విత్తన దుకాణాల్లో తనిఖీలు

విత్తన దుకాణాల్లో తనిఖీలు

ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు పట్టణంలోని విత్తన దుకాణాల్లో సోమవారం ఇంటర్నల్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్తగూడెం డివిజన్​ వ్యవసాయ సహాయ సంచాలకుడు డి.రమేశ్​ మాట్లాడారు. విత్తనాలను బ్లాక్ చేస్తున్నట్టు కానీ, ఎంఆర్పీ కన్నా అధిక రేట్లలకు అమ్ముతున్నట్లు కంప్లైంట్ కానీ వస్తే ఆ వ్యక్తి డీలర్​షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. గ్రామాలకు వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే తీసుకోవద్దని రైతులకు సూచించారు. లైసన్స్​ఉన్న షాపుల్లోని విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులను తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పి.సతీశ్​ ఉన్నారు. 

జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలోని  వెంగన్నపాలెం, కొమ్ముగూడెం, గుండెపూడిలోని పలు విత్తన షాపులను టాస్క్​ఫోర్స్, వ్యవసాయశాఖ ల​అధికారులు సోమవారం తనిఖీ చేశారు. స్టాక్​ వివరాలను  పరిశీలించారు. వివరాలను తప్పనిసరిగా బోర్డులపై  ప్రదర్శించాలని సూచించారు. నాసిరకం విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ లు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో ఇల్లెందు ఏడీఏ వాసవి రాణి, ఏవో రఘు దీపిక పాల్గొన్నారు.