రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ కిస్మాత్ పూర్ లో పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిస్మత్ పూర్ లోని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల గిడ్డంగిలో ఈ తనిఖీలు చేపట్టారు. రైస్ గోదాంలో ఉన్న స్టాక్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం క్షుణ్ణంగా చెక్ చేసింది.
గోదాంలలో ఉన్న స్టాక్ రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తాహసీల్దారు రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.