విమానాల్లో ఫారిన్ లిక్కర్ : ఒక్క రోజు చెక్ చేస్తేనే 415 బాటిళ్లు దొరికాయి..!

విమానాల్లో ఫారిన్ లిక్కర్ : ఒక్క రోజు చెక్ చేస్తేనే 415 బాటిళ్లు దొరికాయి..!

శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గోవాతోపాటు ఇతర విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అధికారులు సీజ్ చేశారు. బుదవారం రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి 2గంటల వరకు శంషాబాద్ విమానాశ్రయంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు చేసిన తనిఖీలు చేశారు. అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ పోర్ట్ లో హైదరాబాద్ కు వొచ్చే డొమెస్టిక్ విమానాలలోని ప్రయాణీకులను చెక్ చేశారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు గండి కొడుతూ ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 415 మద్యం బాటిల్స్ పట్టుకున్నారు. అవి ఎన్డీపీఎల్ బ్రాండ్ కి సంబంధించినవిగా గుర్తించారు. మద్యం బాటిల్స్ తో పాటు బుక్ చేసుకున్న 12 కేసుల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మద్యం మొత్తం 352.68 లీటర్లు ఉందని.. దాని విలువ రూ.12లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Readv :- పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

SHO శంషాబాద్, DTF శంషాబాద్ అధికారులతోపాటు ఎన్ ఫోర్స్ మెంట్ టీంలు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి అక్రమంగా లిక్కర్ తీసుకువచ్చి ఇబ్బందులు పడొద్దని ప్రయాణీకులకు సూచించారు అధికారులు.