
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లలో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ తనిఖీల్లో దిమ్మతిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. పేరొందిన హోటల్స్, రెస్టారెంట్లు మొదలు బార్లు, పబ్‌ల వరకు నాణ్యత లేని ఆహారం వండి పెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉండడం, పురుగుబట్టిన, పాడైపోయిన, కాలం చెల్లిన వస్తువులు, రెండు మూడ్రోజులు నిల్వ ఉంచిన చికెన్ ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు.
ALSO READ : హైదరాబాద్ వీకెండ్ సంతలో.. మోమోస్ తిని మహిళ మృతి
లేటెస్ట్ గా సికింద్రాబాద్ నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. కిచెన్ పరిసరాలు, ప్రిడ్జ్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన ప్రిడ్జ్ లో చికెన్, మటన్ స్టోర్ చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. అలాగే కిచెన్ లో ఓపెన్ డ్రైనేజీ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కేసు నమోదు చేశారు.