ఖైరతాబాద్, లక్డీకపూల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ తనిఖీలు.. రెస్టారెంట్ ఓనర్‎పై సీరియస్

ఖైరతాబాద్, లక్డీకపూల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ తనిఖీలు.. రెస్టారెంట్ ఓనర్‎పై సీరియస్

హైదరాబాద్‎: ఖైరతాబాద్, లక్డీకపూల్ ఏరియాలోని హోటల్స్, రెస్టారెంట్లు, కిచెన్లలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ బుధవారం (నవంబర్ 13) ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఖైరతాబాద్‎లోని మొఘల్ రెస్టారెంట్లో ఆహార పదార్థాల తయారినీ తనిఖీ చేసిన మేయర్.. కిచెన్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ALSO READ | హైదరాబాద్లో ఇలా చేస్తున్న కోచింగ్ సెంటర్లకు ఇక మూడినట్టే..!

డ్రైనేజీ పక్కనే వంట చేస్తుండటం గమనించిన మేయర్.. రెస్టారెంట్ ఓనర్‎పై సీరియస్ అయ్యారు. కుళ్లిపోయిన నాన్ వెజ్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు.. మేయర్ ఆదేశాల మేరకు మొఘల్ రెస్టారెంట్‎ను క్లోజ్ చేశారు. రెస్టారెంట్‎ను సీజ్ చేసిన అధికారులు కిచెన్‎లో ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‎కు పంపారు. కల్తీ ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా మేయర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.