
పాల్వంచ,వెలుగు: కాలం చెల్లిన సామగ్రి వాడుతున్నారని పాల్వంచలోని గోంగూర రెస్టారెంట్ కు ఆఫీసర్లు రూ. 5 వేల జరిమానా విధించారు. మున్సిపల్ సా నీటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు సిబ్బందితో కలిసి ఆదివారం రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ లభించిన సామన్లలో కాలం చెల్లినవి ఉన్నట్టు గుర్తించి, జరిమాన వేసినట్టు తెలిపారు