నిర్మల్ జిల్లాలో..పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్లలో తనిఖీలు

నిర్మల్/బజార్​హత్నూర్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు టెన్త్​ ఎగ్జామ్ సెంటర్లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల వేర్వేరుగా తనిఖీలు చేశారు. పట్టణంలోని జుమేరాత్ పేట్ హైస్కూల్​ను కలెక్టర్ తనిఖీ చేసి అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. మాస్ కాపీయింగ్​కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక చాణక్య హైస్కూల్​లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు.

బజార్​హత్నూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్​లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్​కు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్టూడెంట్లకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్ సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు.