సుల్తానాబాద్, వెలుగు: గత వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్‌ను సకాలంలో అందజేయాలని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ మిల్లర్లను ఆదేశించారు. సోమవారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని సాయి సరస్వతి ఇండస్ట్రీస్, బొంతకుంటపల్లి శివారులోని నందిని ఇండస్ట్రీస్, స్రవంతి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులలో ఆయన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌సీఐకి సప్లై చేయాలన్నారు. అనంతరం సీఎంఆర్ రికార్డులను, ప్రస్తుతం నిల్వ ధాన్యాన్ని పరిశీలించారు. అంతకుముందు పెద్దపల్లి కలెక్టరేట్‌లో సీఎంఆర్‌పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. డీసీవో శ్రీమాల, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ ప్రవీణ్, డీఆర్‌డీవో రవీందర్, అధికారులు ఉన్నారు.