రాయికల్​ పట్టణంలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు

రాయికల్​ పట్టణంలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు

రాయికల్​, వెలుగు: రాయికల్​ పట్టణంలోని విత్తన దుకాణాలను టాస్క్‌‌ఫోర్స్‌‌ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. విత్తనాలు, స్టాకురిజిష్టర్​లను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అమ్మాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  తనిఖీల్లో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్​, రూరల్​ సీఐ ఆరిఫ్​అలిఖాన్​, ఎస్ఐ అజయ్​, ఏవో ముక్తీశ్వర్​ఉన్నారు.  అంతకుముందు మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు విత్తన కొనుగోళ్లపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఏఈవోలు పద్మావతి , రాజేశ్, మత్తయి , సృజన పాల్గొన్నారు.

వేములవాడరూరల్, వెలుగు: రైతులు లూజ్​విత్తనాలను కొనుగోలు చేయొద్దని ఏఈవో అనూష అన్నారు. వేములవాడ రూరల్​ మండలం  మర్రిపల్లి, నాగయపల్లి గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.