ఇంగ్లండ్‌‌‌‌కు షాక్​.. సెమీస్‌‌‌‌కు విండీస్‌‌‌‌

ఇంగ్లండ్‌‌‌‌కు షాక్​.. సెమీస్‌‌‌‌కు విండీస్‌‌‌‌

దుబాయ్‌‌‌‌: విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో వెస్టిండీస్‌‌‌‌ సంచలనం చేసింది. గ్రూప్‌‌‌‌–బిలో టేబుల్‌‌‌‌ టాపర్‌‌‌‌గా ఉన్న ఇంగ్లండ్‌‌‌‌కు షాకిచ్చి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో హీలీ మాథ్యూస్‌‌‌‌ (50), క్వియానా జోసెఫ్‌‌‌‌ (52), డాటిన్‌‌‌‌ (27) రాణించడంతో.. మంగళవారం జరిగిన చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన ఇంగ్లండ్‌‌‌‌ 20 ఓవర్లలో 141/7 స్కోరు చేసింది. బ్రంట్‌‌‌‌ (57 నాటౌట్‌‌‌‌), హీథర్‌‌‌‌ నైట్‌‌‌‌ (21) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 

ఫ్లెచర్‌‌‌‌ 3, మాథ్యూస్‌‌‌‌ 2 వికెట్లు తీసింది. తర్వాత విండీస్‌‌‌‌ 18 ఓవర్లలో 144/4 స్కోరు చేసి నెగ్గింది. మాథ్యూస్‌‌‌‌, జోసెఫ్‌‌‌‌ తొలి వికెట్‌‌‌‌కు 102 రన్స్‌‌‌‌ జోడించి మంచి పునాది వేశారు. చివర్లో డాటిన్‌‌‌‌ దాటిగా ఆడి విజయానికి అవసరమైన రన్స్‌‌‌‌ను అందించింది. జోసెఫ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. మెరుగైన రన్‌‌‌‌రేట్‌‌‌‌తో సౌతాఫ్రికా సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను ఖాయం చేసుకోగా, ఇంగ్లండ్‌‌‌‌ ఇంటిముఖం పట్టింది. ఓవరాల్‌‌‌‌గా టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో విండీస్‌‌‌‌ సెమీస్​ చేరడం ఇది ఆరోసారి. ఇక ఇంగ్లండ్‌‌‌‌తో గత 14 టీ20ల్లో తొలిసారి నెగ్గిన కరీబియన్‌‌‌‌ జట్టు.. 10 ఏండ్ల తర్వాత విదేశాల్లో ఆ జట్టుపై గెలవడం ఇదే మొదటిసారి.