- ఆకట్టుకున్న డీఆర్డీఏ, ఇస్రో నమూనాల ప్రదర్శన
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో డీఆర్డీఏ, ఇస్రోకు సంబంధించిన నమూనాలను అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఉమెన్స్ కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ప్రధానంగా చంద్రయాన్, రాకెట్లు, ఆర్యభట్ట స్కేల్, జీఎస్ఎల్వీ రాకెట్లు తదితర ప్రదర్శనలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు ఈ ప్రదర్శనలు ఉంటాయని ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో ముందుండాలని అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఉమెన్స్ కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి అన్నారు. నగరంలో వివిధ విద్యా సంస్థల నుంచి ఈ ప్రదర్శన కు విద్యార్థులు వచ్చారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్