తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం గార్లొడ్డు లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఓ యువకుడు ట్రాన్స్జెండర్ను పెండ్లి చేసుకున్నాడు. ఏన్కూర్కు చెందిన నక్షత్ర (ట్రాన్స్ జెండర్)కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వేమిరెడ్డిపల్లి తండాకు చెందిన అజ్మీరా నందూకు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది.
ఇది కాస్తా ప్రేమగా మారింది. రెండేండ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెండ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. దీంతో ఆదివారం గార్లొడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు కలిసి వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు.