ఇన్​స్టాగ్రామ్ వాడే వారు ..ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి..

ఇన్​స్టాగ్రామ్ వాడే వారు ..ఈ   కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి..

ఈ ఫీచర్ ద్వారా ఫ్రెండ్ లేదా గ్రూప్​ చాట్​కు స్పెషల్​గా షేర్ చేసుకునే రీల్స్ ఫీడ్​ను అందిస్తుంది. యూజర్లు ఇప్పుడు తమ ఫ్రెండ్స్​తో ప్రైవేట్, కస్టమైజ్డ్ రీల్స్​ ఫీడ్​ను షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ ఇన్​స్టాగ్రామ్​ డైరెక్ట్ మెసేజ్​ల (డిఎమ్స్) లానే ప్రైవేట్ అని కంపెనీ చెప్తుంది. దీని ద్వారా మీరు, మీ ఫ్రెండ్స్ చూస్తున్న వేర్వేరు రీల్స్ అన్నీ కలిసిపోయి ఒక ‘షేర్డ్​ కస్టమ్​ రీల్స్ ఫీడ్​’గా తయారవుతుంది. అంటే మీ ఫ్రెండ్ ఇన్​స్టాగ్రామ్ యాక్టివిటీ ఆధారంగా రీల్స్​ లిస్ట్​ రెడీ అవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇన్​స్టాగ్రామ్​ బ్లెండ్​ గ్రూప్​లోని వాళ్ల ఇష్టాల ఆధారంగా రీల్స్​ను అరేంజ్ చేసి చూపిస్తుంది. దీంతో బ్లెండ్​ను ఓపెన్ చేసినప్పుడల్లా కొత్త రీల్స్ చూడొచ్చు. అందులోని ఫీడ్​ మీ ఫ్రెండ్స్​కు ఇష్టాలను తెలియజేస్తుంది. మామూలుగా ఏదైనా రీల్ నచ్చితే ఫ్రెండ్స్​కి షేర్ చేస్తుంటారు. బ్లెండ్​ ఫీచర్ వచ్చింది కాబట్టి ఇక ఆ అవసరం ఉండకపోవచ్చు. 

ఎలా వాడాలంటే.. 

ఇన్​స్టాగ్రామ్​లోని ఒక డిఎమ్​ చాట్​ను ఓపెన్ చేయాలి. పైన ఉన్న బ్లెండ్​ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇన్వైట్ అనే ఆప్షన్​ ద్వారా ఫ్రెండ్స్​కు ఇన్విటేషన్ పంపాలి. అవతలి వాళ్లు దాన్ని యాక్సెప్ట్ చేయగానే బ్లెండ్​ షేర్డ్ ఫీడ్ యాక్టివ్ అవుతుంది. ఇద్దరు యూజర్లూ బ్లెండ్​లో జాయిన్ కాగానే డిఎమ్​ ద్వారా షేర్ చేసిన ఏదైనా రీల్​ బ్లెండ్​ ఫీడ్​లో ఆటోమెటిక్​గా అప్​డేట్ అవుతుంది. అంతేకాకుండా ఆ చాట్​లో ఉన్నవాళ్లంతా ఆ బ్లెండ్ రీల్స్​ ఫీడ్​ను ఎప్పుడైనా మళ్లీ చూసుకోవచ్చు. బ్లెండ్​లోని ప్రతి రీల్​తోపాటు అది ఎవరికి కనిపించాలో వాళ్ల పేరు కూడా ఉంటుంది. యూజర్లు రీల్స్ చూస్తున్నప్పుడు కింద ఉన్న మెసేజ్​ బార్ నుంచి చాట్ చేయొచ్చు. ఎమోజీలతో కూడా రెస్పాండ్ అవ్వొచ్చు. ఇప్పటికైతే డిఎమ్స్​లో వాడొచ్చు. ప్రతి బ్లెండ్​ చాట్​ ఒక్కొక్కటి స్పెషల్​గా క్రియేట్ అవుతుంది.