
ఫేస్ బుక్ – ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇన్ స్టాగ్రామ్ నుంచి మెసెంజర్ కు డైరక్ట్ గా మేసేజ్ చేసేలా డిజైన్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్, మెసెంజర్ చాట్‌లను ఒకే యాప్‌లో విలీనం చేసేందుకు తన ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగానే కొన్నింటిని విలీనం చేసే దిశగా పని ప్రారంభించింది. ఈ సౌకర్యం ప్రస్తుతం యూఎస్‌లోని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇన్‌స్టాగ్రాం యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం అన్ని చోట్ల ఈ ఫీచర్ తీసుకురానున్నట్లు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ వెల్లడించారు.