ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేటర్స్ చేసే రీల్స్ ఇప్పటివరకు 90 సెకన్లు మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఆ నిడివిని మూడు నిమిషాలకు పెంచుతున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. యూట్యూబ్ కూడా షార్ట్స్కి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలకు పెంచాలని గతేడాదే ప్రకటించింది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ రన్ టైం పెంచడానికి గల కారణాలు కూడా తెలియజేశారు. చాలామంది తాము పెట్టే కంటెంట్ పూర్తికాకుండానే టైం అయిపోతోందని ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్టు తెలిపింది.
కంటెంట్ క్రియేటర్స్ చెప్పాలనుకున్న విషయాన్ని పూర్తి చేయడానికి మూడు నిమిషాల టైం సరిపోతుందని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందట కంపెనీ. అయితే ఇప్పుడు సెకన్ల టైంలో పూర్తయ్యే రీల్స్, షార్ట్స్కి అలవాటు పడిన పబ్లిక్ వాటి టైం పెంచడం వల్ల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.