
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో జాగ్రత్తతో ఉండటం అవసరమని నిపుణులు హెచ్చరిస్తుంటారు. సరైన జాగ్రత్తలు తీసుకున్నా, సెక్యూరిటీ మార్పులు చేసినప్పటికీ ఒక్కోసారి అకౌంట్లు హ్యాక్ అవుతుంటాయి. దీన్ని పక్కనబెడితే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను రిమోట్‌గా యాక్సెస్ చేసుకునేలా హ్యాకర్లు కొత్త బగ్‌ను సృష్టించారని తెలిసింది. కొత్త బగ్‌తో యూజర్ల మెసేజ్‌లను నేరుగా చదవడంతోపాటు ఏదైనా పోస్ట్ చేయొచ్చని సమాచారం. హ్యాకర్లు యూజర్లకు జేపీఈజీ ఇమేజ్‌ను పంపుతారు. ఆ ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే రిమోట్ కంట్రోల్ ద్వారా వారి ఇన్‌స్టా అకౌంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ బగ్‌తో ఫోన్‌లోని మొత్తం కాంటాక్ట్ లిస్ట్‌ను యాక్సెస్ చేయొచ్చని, కెమెరా, లొకేషన్ డేటాను యాక్సెస్ చేసేలా దీన్ని రూపొందించారని తెలిసింది. ఈ బగ్‌ను రీసెర్చర్స్ ముందే గుర్తించి ఫేస్‌బుక్‌ను అలర్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఫేస్‌బుక్ తగిన సెక్యూరిటీ చర్యలు తీసుకుంది.