ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లకు చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ చూసి చాలామంది క్రియేటర్లు కావాలనుకుంటున్నారు కూడా. అయితే, అందరూ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోవచ్చు. అందుకే ప్రతి పనికి ముందు ట్రయల్ చేసినట్టు, ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ కోసం కూడా ట్రయల్ ఫీచర్ తీసుకొచ్చింది. అంటే ట్రయల్ రీల్లో తాము ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇంకా ఎంత బెటర్ అవ్వాలి? అనేది తెలుసుకోవచ్చు. పర్ఫెక్ట్గా రీల్ చేసేవరకు ఈ ట్రయల్ రీల్స్ ట్రై చేసి, ఆ తర్వాత ఆ రీల్ పోస్ట్ చేయాలా? వద్దా? అని డిసైడ్ అవ్వొచ్చు. అసలు ఇంతకీ ఇది ఎలా ఉపయోగించాలి అంటారా..
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఒక రీల్ క్రియేట్ చేయాలి. దాన్ని షేర్ చేసే ముందు ట్రయల్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ ట్రయల్ క్లిప్ డ్రాఫ్ట్స్ సెక్షన్లో కనిపిస్తుంది. రీల్ బాగా వచ్చిందనిపిస్తే షేర్ చేసేయొచ్చు అంతే! షేర్ చేయనంతవరకు అది ప్రొఫైల్ గ్రిడ్‌లో ఉంటుంది. రీల్స్ ట్యాబ్‌లో కనిపించదు. ఒకవేళ మీ ట్రయల్ రీల్ ఫాలోవర్ల ఫీడ్‌లో కనిపించనప్పటికీ ఒకే ఆడియో లేదా ఫిల్టర్ వాడిన రీల్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా కనిపెట్టొచ్చు.
అలాగే ఫాలోవర్లతో పంచుకోవాలా? వద్దా? అనేది డిసైడ్ అవ్వాలంటే.. ట్రయల్ రీల్‌కి ఒకరోజు తర్వాత వ్యూస్, లైక్స్, షేర్ల వంటి ఎంగేజ్మెంట్ మెట్రిక్‌లను బట్టి తెలుసుకోవచ్చు. 72 గంటల తర్వాత బాగా వెళ్లే ట్రయల్ రీల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ని అలో చేస్తే ఆటోమెటిక్‌గా అప్లోడ్ అవుతుంది.