బెంగళూరు: కర్నాటక రాజధాని నగరం బెంగళూరు బీటీఎం లే-ఔట్లో ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్కు చేదు అనుభవం ఎదురైంది. నేహా బిస్వాల్ అనే ఇన్స్టాగ్రాం ఇన్ఫ్లుయెన్సర్ వర్క్ ఫినిష్ చేసుకుని బీటీఎం లే-ఔట్ వీధుల్లో ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ డైలీ వ్లాగ్ చేస్తుంది. ఆమెపై పదేళ్ల వయసున్న పిల్లాడు ఈవ్ టీజింగ్కు పాల్పడ్డాడు. ఆమె డైలీ వ్లాగ్ చేస్తుండగా ఒక పదేళ్ల పిల్లాడు సైకిల్పై రయ్ మంటూ ఆమెకు ఎదురొచ్చాడు. సైకిల్పై ఆమె పక్కగా వెళుతూ ఆమె ఛాతి భాగాన్ని చేతులతో తడిమేసి వెళ్లిపోయాడు. ఊహించని ఈ షాకింగ్ పరిణామంతో బిస్వాల్ నోట మాట రాలేదు.
Girl getting groped openly in Bangalore. pic.twitter.com/oI6QjCju9Y
— Aarti✍️ (@ItsAarti_) November 6, 2024
ఈ ఘటన కూడా డైలీ వ్లాగ్ లో రికార్డ్ కావడంతో బాధితురాలు ఘటనకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది. హాయ్ అని విష్ చేసి ఇలా పింక్ టాప్ డ్రెస్పై ఆమెను అసభ్యంగా తడిమేసి వెళ్లిపోయాడని బాధితురాలు లైవ్ వీడియోలో కన్నీరుమున్నీరయింది. బెంగళూరులో మహిళలు సేఫ్గా ఉంటారని తాను భావించడం లేదని మహిళల భద్రతపై సదరు ఇన్ఫ్లుయెన్సర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నెటిజన్లు బాధితురాలికి అండగా నిలిచారు.
An Instagram user, @nehabiswal120, has reported facing sexual harassment in BTM Layout, Bengaluru. She claims that while she was walking down the street, a boy on a bicycle approached her, greeted her with a "hi," and then inappropriately touched her before quickly fleeing the… pic.twitter.com/R6qXDnVUc8
— Karnataka Portfolio (@karnatakaportf) November 6, 2024
బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె లాంటి ఆర్థికంగా వృద్ధి చెందిన నగరాల్లో శాంతిభద్రతలు శూన్యమని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పోలీసులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని పోలీస్ వ్యవస్థ పనితీరుపై సందేహం వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ యువతిపై వేధింపులకు పాల్పడిన మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఆమెను టచ్ చేసి అక్కడి నుంచి ఆ పిల్లాడు సైకిల్పై వెళ్లిపోయే లోపు ఈమె కేకలు విని అతనిని స్థానికులు పట్టుకున్నారు. తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆ పిల్లాడిని బాధితురాలు కొట్టింది. ఆమెతో పాటు మరికొందరు ఆ పిల్లాడిని కొట్టారు. ఆ పిల్లాడిని మందలించిన తర్వాత చిన్న పిల్లాడని, కావాలని ఇలా చేసి ఉండడని.. అతనిని వదిలేయాలని కొందరు బిస్వాల్ను కోరారు. అందుకు ఆమె నిరాకరించింది.
ఇలా చేసింది పిల్లాడని బాధితురాలు క్షమించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ.. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన గురించి అందరికీ తెలిసింది. నేహా బిస్వాల్కు ఇన్ స్టాగ్రాంలో 4 లక్షల 36 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఈ యువతి తన డైలీ రొటీన్ లైఫ్ గురించి వ్లాగ్స్ చేసి ఫేమస్ అయింది.