ఇన్​స్టాగ్రామ్​ వాడుతున్న వాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!

ఇన్​స్టాగ్రామ్​ వాడుతున్న వాళ్లకు ఈ విషయం తెలుసో.. లేదో..!

ఇన్​స్టాగ్రామ్​లో ప్రొఫైల్ కార్డ్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. ఈ కార్డ్​ ఎందుకు? ఎలా పనిచేస్తుంది? అంటే.. ఈ కార్డ్ ద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మందితో షేర్ చేసుకోవచ్చు. మామూలుగా ఇన్​స్టాగ్రామ్​లో ఒకే పేరుతో చాలాసార్లు వేర్వేరు ప్రొఫైల్స్ క్రియేట్ అవుతుంటాయి. ఈ కార్డ్ ద్వారా ఫాలోవర్లు మిమ్మల్ని మాత్రమే ఫాలో అయ్యేందుకు వీలుంటుంది. ఈ ప్రొఫైల్ కార్డ్​లో క్యూఆర్​ కోడ్​ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా డైరెక్ట్​గా ప్రొఫైల్ ఓపెన్​ చేసి ఫాలో అయిపోవచ్చు. ఇది చూడడానికి డిజిటల్ కార్డ్​లా ఉంటుంది.

ALSO READ : ఇల్లు పెద్దదై వైఫై సిగ్నల్స్ రేంజ్​ తగ్గి..ఇంటర్నెట్​ స్పీడ్​ వస్తలేదా..?

అందులో బయోడేటా, ఇతర పేజీల లింక్​లు, మీ ఫేవరేట్​ సాంగ్ వంటి వాటిని పెట్టుకోవచ్చు. అంతేకాదు... మీ కార్డ్​ని కస్టమైజ్​ చేయొచ్చు. బ్యాక్​గ్రౌండ్​ కూడా మార్చొచ్చు. సెల్ఫీలను అప్​లోడ్​ చేయొచ్చు. కస్టమైజ్డ్​ ఎమోజీలను కూడా యాడ్ చేయొచ్చు. ప్రొఫైల్ కార్డ్​ను షేర్ చేయాలంటే.. ఇన్​స్టాగ్రామ్​ ప్రొఫైల్​ ఓపెన్​ చేయాలి. అందులో షేర్ ప్రొఫైల్​ ఆప్షన్​ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేసి ప్రొఫైల్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్​ చేయాలి. అవసరమైన వివరాలను ఎడిట్ చేయొచ్చు కూడా. తర్వాత ఇన్​స్టాగ్రామ్ ప్రొఫైల్​ కార్డ్​ని స్టోరీలో షేర్ చేయొచ్చు. ఇతర సోషల్ నెట్​వర్క్​లలో కూడా షేర్​ చేయొచ్చు. కావాలంటే దీన్ని వాట్సాప్​ గ్రూప్​ల్లో షేర్ చేయొచ్చు. దీంతో ఫాలోవర్లు పెరిగే ఛాన్స్ ఉంది.