ప్రాణం తీసిన ఇన్​స్టాగ్రామ్ రీల్స్

  • రైల్వే ట్రాక్ పై వీడియో తీస్తుండగా ఢీకొట్టిన ట్రైన్... మదర్సా స్టూడెంట్ మృతి

సికింద్రాబాద్​, వెలుగు : ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేయాలని రైల్వే ట్రాక్​ పక్కన వీడియోలు తీస్తుండగా రైలు ఢీకొని మదర్సాలో చదివే ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్​రహ్మత్​నగర్​ శ్రీరామ్​నగర్​కు చెందిన మహ్మద్​ సర్ఫరాజ్​(16) అదే ప్రాంతంలోని మదర్సాలో చదువుతున్నాడు. ఇతడికి వీడియోలు తీసి ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేయడం అలవాటు. సర్ఫరాజ్​ మరో ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి శుక్రవారం సనత్​నగర్​ రైల్వే ట్రాక్​పై వీడియోలు తీసేందుకు వెళ్లాడు.  

ట్రాక్​పై సర్ఫరాజ్​  ట్రైన్​ కంటే ముందు పరుగెత్తుతుండగా మరో ఇద్దరు వీడియోలు తీస్తున్నారు. ఇదే టైంలో అటుగా వచ్చిన రైలు ఢీకొనడంతో సర్ఫరాజ్​ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్​బాడీని మార్చురీకి తరలించారు. వారి సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు.