టెక్నాలజీ ..ఇన్​స్టా​ రీల్స్ డౌన్​లోడ్​ ఇలా

టెక్నాలజీ ..ఇన్​స్టా​ రీల్స్ డౌన్​లోడ్​ ఇలా

ఇన్​స్టాగ్రామ్ రీల్స్​ను మెటా 2020లో ప్రారంభించింది. అప్పటివరకు టిక్​టాక్​ షార్ట్​ వీడియో యాప్​ పాపులర్​గా ఉండేది. జూన్​ 2020లో ఇండియా గవర్నమెంట్​ టిక్​టాక్​ను బ్యాన్​ చేసింది. సరిగ్గా ఆ టైంలోనే ఇన్​స్టా వచ్చింది. ఇన్​స్టా​ రీల్స్​లో 60 సెకండ్ల నిడివి గల వీడియోలు చేయొచ్చు. వాటిని ఇన్​స్టా ఎక్స్​ప్లోర్​ పేజీలో పోస్ట్​ చేయొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే టిక్​టాక్​ ఇన్​స్పిరేషన్​తో మెటా తయారుచేసిన ఇన్​స్టా యాప్​లో​ షార్ట్​ వీడియోలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్​ కంటెంట్​ అయ్యాయి.

 అలాగే రీల్స్​ చేసేవాళ్లకు ఇది ఆదాయ మార్గం కూడా అయింది. ఇప్పటివరకు ఫొటో, వీడియోలు షేర్​ చేసే ఛాన్స్​ ఉన్న ఈ యాప్​లో ఇకనుంచి రీల్స్​ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఆరాంగా మీకు ఖాళీ టైం దొరికినప్పుడే వాటిని చూసే అవకాశం ఉంది.  అంతేకాదు ఈ యాప్​లో లేని ఫ్రెండ్స్​కి కూడా వాటిని షేర్​ చేయొచ్చు. ఇన్​స్టాలోని రీల్స్​ను ఆండ్రాయిడ్​ లేదా ఐ ఫోన్లలో ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలంటే...

  •     స్మార్ట్​ ఫోన్​లో ఇన్​స్టాగ్రామ్​ యాప్​ ఓపెన్​ చేయాలి.
  •      ఏ రీల్​ అయితే సేవ్​ చేయాలనుకుంటున్నారో దాన్ని ఓపెన్​ చేయాలి. ఆ రీల్​ మీద ఉన్న షేర్​ ఐకాన్​ మీద క్లిక్​ చేయాలి.
  •     యువర్​ స్టోరీలో ఆ రీల్స్​ యాడ్​ చేయాలి.
  •     తరువాత ప్రివ్యూను జూమ్​ చేసి వీడియో పైన ఉన్న మూడు చుక్కల​ మెనుని క్లిక్ చేయాలి. ఆ తరువాత సేవ్​ ఆప్షన్​ క్లిక్​ చేయాలి. 
  •     ఆ తరువాత స్టోరీని తీసేయాలి.

డౌన్​లోడ్​ చేసుకున్న రీల్​ను కెమెరా రోల్​లో చూడొచ్చు. డౌన్​లోడ్​ చేసిన రీల్​ మీద ఇన్​స్టాగ్రామ్​ వాటర్​మార్క్​ ఉండదు. ఆ అకౌంట్​ యూజర్​నేమ్​ ఉంటుంది. ప్రస్తుతానికి పబ్లిక్​ అకౌంట్స్​లో షేర్​ చేసిన రీల్స్​ మాత్రమే డౌన్​లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్​ ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో షేర్​ చేసిన వీడియోలను డౌన్​లోడ్ చేయడం కుదరదు. అలాగే పబ్లిక్​ అకౌంట్​లో ఉన్న రీల్స్​ మరెవరు డౌన్​లోడ్​ చేసుకోవడం ఇష్టం లేకపోతే యాప్​ సెట్టింగ్స్​లో ఆ చాయిస్​ను డిసేబుల్​ చేసుకోవచ్చు.

ఎయిర్​డ్రాప్​తో షేరింగ్​ ఈజీ!

ఎయిర్​డ్రాప్​ ఉంటే ఐఓఎస్​ 17 లో ఒక్క ట్యాప్‌‌తో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. యాపిల్​ ఈ మధ్య రిలీజ్​ చేసిన ఐఫోన్​ మోడల్​లో ఐఓఎస్​17  ఉంది. ఈ లేటెస్ట్​ అప్​డేట్​లో స్మార్ట్​ఫోన్స్​కు చాలా కొత్త ఫీచర్లు వచ్చేశాయి. అలాగే ఆపరేటింగ్​ సిస్టమ్​ కూడా చాలా మెరుగుపడింది. మరీముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సిన అప్​డేట్​ ఒకటి ఉంది. అదే ఎయిర్​డ్రాప్. దాని​ ద్వారా ఇక మీదట ఫైల్స్​ షేర్​ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. 

ఇప్పటివరకు అయితే యాపిల్​ ఫోన్​ నుంచి ఫైల్​, ఇమేజ్​, వీడియో షేరింగ్​ చేయాలంటే నెట్​వర్క్​ షేరింగ్​ కనెక్షన్​ అవసరం. కానీ ఇప్పుడు ఐఓఎస్​17 అప్​డేట్​ చేశాక మీ ఐఫోన్​ను మరో ఐఫోన్​ దగ్గరగా పెడితే చాలు  సింగిల్​ టచ్​తో మీడియాల ఫైల్స్​ స్పీడ్​గా షేర్​ అవుతాయి.
ఐఓఎస్​ 17కి అప్​డేట్​ అయిన అన్ని ఐఫోన్స్​లో ఈ షేరింగ్​ సిస్టమ్​ అందుబాటులో ఉంది.  అలాగని సెక్యురిటీ ప్రాబ్లమ్​ గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఫోన్​ సెట్టింగ్స్​  కంట్రోల్​ మీ చేతిలోనే ఉంటుంది. ఎయిర్​డ్రాప్​ ఫీచర్​ మీ ఫోన్​లో ఎనేబుల్​ అయిందో లేదో చూడాలంటే  ఐఫోన్​ కమాండ్​ సెంటర్​ ద్వారా చేసుకోవచ్చు.
ఐఓఎస్​17లో ఎయిర్​డ్రాప్​ ద్వారా ఫోటోలు, వీడియోలు ఇలా షేర్​ చేయాలి...

  •     మీ ఐ ఫోన్​ ఐఓఎస్​17  వెర్షన్‌‌కి అప్​డేట్​ అయిందా, లేదా చూడాలి. ఇప్పుడున్న ఐఓఎస్​ వెర్షన్​  17.0.2.
  •     సెట్టింగ్‌‌ క్లిక్​ చేసి, జనరల్​– ఎయిర్​డ్రాప్​ క్లిక్​ చేయాలి. 
  •     బ్రింగింగ్ డివైసెస్ టుగెదర్ అనే ఆప్షన్​ క్లిక్​ చేస్తే రెండు ఫోన్ల మధ్య కనెక్షన్​  ఏర్పడుతుంది. 
  •     ఫొటో యాప్‌‌ ఓపెన్​ చేసి మీరు షేర్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియో సెలక్ట్​ చేసుకోవాలి.
  •     తరువాత ఐఫోన్​ను మీరు షేర్​ చేయాలనుకున్న ఐఫోన్​ దగ్గర పెట్టి షేర్​ బటన్​ క్లిక్​ చేయాలి. అంతే మీరు ఫైల్స్​ ఎయిర్​డ్రాప్ ఫీచర్​ ద్వారా ఆ ఫోన్​కి షేర్​ అవుతాయి.