ఆండ్రాయిడ్ లో ఇన్ స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్ వినియోగం తగ్గింది. థ్రెడ్స్ యాప్ కు డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అయితే Analytics సంస్థ Similarweb estimates ప్రకారం.. ఆండ్రాయిడ్ యాప్ థ్రెడ్స్.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7 నాటికి రోజువారీ వినియోగదారుల సంఖ్య 10.3 మిలియన్లకు పడిపోయింది. జూలై 7 నాటి 49.3 మిలియన్ల వినియోగదారులన్న థ్రెడ్స్.. నెల వ్యవధిలోనే 30 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది. అయితే X గా మారిన ఎలాన్ మస్క్ ట్విట్టర్ వినియోగదారులను పెంచుకుంటూ పోతూనే ఉండటం విశేషం.
ప్రారంభంలో థ్రెడ్స్ వినియోగదారులలో ఆసక్తిని రేకిత్తించింది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను కొత్త టెక్స్ట్-ఆధారిత సామాజిక యాప్‌కి ఆకర్షించింది. అయితే ఈ ఉత్సాహం స్వల్పకాలికం అయింది. యాప్ క్రియాశీల వినియోగదారుల సంఖ్య త్వరగా పడిపోయింది. ప్రారంభంలో వినియోగదారులను ఆకర్షించినప్పటికీ.. కాలక్రమేణా థ్రెడ్స్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కష్టపడాల్సి వస్తోంది.
థ్రెడ్స్, X (గతంలో Twitter) లను పోలిస్తే.. X ఆండ్రాయిడ్ లో 100 మిలియన్ల కంటే ఎక్కువ రోజువారీ క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది. ఈ ప్లాట్ ఫారమ్ లో రోజుకు సుమారు 25 నిమిషాలు గడిపుతున్నారు. జూలై 7న ప్రపంచ వ్యాప్తంగా థ్రెడ్స్ సగటున 14 నిమిషాలు యూజర్లు ఈ ఫ్లాట్ ఫారమ్ లో గడిపారు. అయితే ఆగస్టు 7న నాటికి 3 నిమిషాలకు యాక్టివ్ యూజర్ల సమయం పడిపోయింది.
మొదట్లో థ్రెడ్స్ యూజర్లను ఆకట్టుకున్నప్పటికీ X మాదిరిగా వినియోగదారుల ఆసక్తిని, కొత్త యూజర్లను నిలబెట్టుకోలేకపోయింది. X యజమాని ఎలోన్ మస్క్ విమర్శించినట్లు.. థ్రెడ్స్ యాప్ లో వినియోగదారులను ఎక్కువ సమయం కట్టిపడేసేంత ఆకర్షణీయమైన కంటెంట్ లేదని నిపుణులు అంటున్నారు.