ఇన్స్టాగ్రామ్ వచ్చాక రీల్స్ ట్రెండ్ బాగా పెరిగింది. అయితే, ఒక రీల్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో పాట ప్లే అవుతుంటుంది. అయితే, ఇప్పుడు ఒక్క రీల్‌కి మల్టీ ట్రాక్‌లు పెట్టుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆడియో మిక్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్‌స్టా అకౌంట్ ఫాలోవర్లు ఈ మిక్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవసరమైతే తిరిగి వాడుకోవచ్చు. ఈ మల్టీ ఆడియో ట్రాక్ సాయంతో దాదాపు 20 ఆడియో ట్రాక్స్ వరకు యాడ్ చేయొచ్చు.
వీడియోలో ప్రతి ఫ్రేమ్‌కు ఆడియో మిక్స్ చేయొచ్చు. అంతేకాదు.. ఆడియోను ఎడిట్ చేసేటప్పుడు టెక్స్ట్, స్టిక్కర్స్, క్లిప్స్‌తో అలైన్ చేయొచ్చు కూడా. వీడియోలు ఎడిట్ చేసేందుకు అదనంగా వేరే టూల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ మొదటిగా ఇండియాలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మల్టీ ఆడియో ట్రాక్స్ క్రియేట్ చేయొచ్చు.